మగాళ్ళూ… ఇల్లు కొనడం మానండి.

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తను సంపాదించిన దానిమీద హక్కు వుంటుంది. తను కష్టపడి కొనుక్కున్న ఇంటి మీద హక్కు వుంటుంది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇల్లు కట్టు కున్నవాడి కంటే, దాన్ని ఆక్రమించుకొనే వారే అధికం. తాజాగా అలాంటి దురాక్రమణ దారుల జాబితాలో భార్యలు కూడా చేరిపోయారు. నీ ఇల్లును ఎవరైనా దురాక్రమణ దారులు ఆక్రమించుకుంటే చట్టం సహాయంతో దాన్ని తిరిగి పొందొచ్చు. కానీ చట్టమే దురాక్రమణను సహకరించే విదంగా రుపొందిస్తే..?

ఆ చట్టం పేరే, గృహహింస నిరోధక చట్టం. గృహహింస నిరోదక చట్టం అనగానే గృహహింస బాదితులు ఆడవారైనా మగవారైనా వర్తిస్తుందనుకుంటే నువ్వు పిచ్చోడి కిందే లెక్క. ఘనత వహించిన మన శ్రీమతి వాదులు (కాకపోతే తాము స్త్రీ వాదులమని చెప్పుకు తిరుగుతుంటార్లెండి) దృష్టిలో మాత్రం గృహహింస అంటే స్త్రీలపై హింస మాత్రమే. హక్కులు అంటే స్త్రీల హక్కులు మాత్రమే. మగవారు కూడా మనుషులని, వారికి హక్కులుంటాయని వారు చాలా అరుదుగా మాత్రమే అంగీకరిస్తారు. ఆ అరుదుగానైన అది సంభవించాలి అంటే, స్త్రీలు మనకిచ్చినవి (మిగిలించినవి)మాత్రమే మన హక్కులు అని మనం అంగీకరించి, వారు చెప్పినదానికి గంగిరెద్దులా తలూపినప్పుడు మాత్రమే.

ఉదాహరణకి, నువ్వు చచ్చి చెడి ఒక ఇల్లు కట్టుకున్నావని అనుకుందాం. డబ్బులు నీదగ్గర్లేక హోంలోను తీసుకొని, నెల నెలా EMI లు కడుతూ సొంతిల్లు కట్టుకున్నావనుకుందాం. ఆ ఇంటి మీద నీకెంతో అపేక్ష వుండడం సహజం. దాన్ని నీ సొంత బిడ్డలా చూసుకోవడం సహజమే. కానీ నువ్వు స్త్రీలను పూజించే పవిత్ర భారత దేశంలో పుట్టావ్. స్త్రీల హక్కులు మాత్రమే హక్కులు నమ్మే విచిత్ర జీవుల మధ్య బతుకుతున్నావ్. కాబట్టి అది నీ సొంతిల్లు కానట్టే లెక్క. అ రోజు నువ్వు పెళ్ళి చేసుకుంటావ్. అంతా సక్రమంగా వుంటే పర్లేదు. కానీ నీ భార్యతో నీకు గొడవలు వచ్చాయనుకో, నీ ఇల్లు నీకు కాకుండా పోయే పరిస్థితి నీకు దాపురించినట్లె. అలా జరగకుండా వుండాలంటే నీ భార్య చెప్పిన దానికి తానా తందానా అంటు డూ డూ బసవన్నలా తలాడించాలి. అప్పుడు నీ ఇంట్లో నీకు నివాసముండే హక్కును ని భార్య నీకు ముష్టిగా పడేస్తుంది. కాదూ కూడాదు అనో, ఆత్మగౌరవం, సొంత అభిప్రాయాలు లాంటి చెత్త అభిప్రాయాలను నువ్వు కలిగివున్నావో, అంతే సంగతులు. నీ సొంత ఇంటిలోనుండి నిన్ను చట్టం సహాయంతో నిన్ను గెంటేయించే హక్కు నీ భార్యకు గృహహింస చట్టం కల్పిస్తుంది.

కనీసము అలా బతికినా నీ ఇల్లు నీకు నిలబడుతుందా అంటే అదికూడా లేదు. వుదాహరణకు ఒక వ్యక్తి భార్యకు అతనితో వుండడం అసలు ఇష్టంలేదనుకుందాం, అప్పుడు అతన్ని ఎవరూ కాపాడలేరు, తనను హింసిస్తున్నాడు ఒక కేసు పెట్టి, అతను ఇంట్లో వుంటే తన మీద హింస రోజు జరిగే అవకాసం వుందని వాదించి, అతని సొంత ఇంటి నుండి అతన్ని గెంటేయించవచ్చు. అసలు ఆ వ్యక్తి ఆ ప్రాంతములోకి రావడానికి కూడా అవకాశములేకుండ చేయవచ్చు. అంటే ఆ వ్యక్తి భార్యకు ఇష్టముంటేనే, ఆవ్యక్తికి భవిష్యత్తు. వారెవా క్యా జమానా హై. అసలు చట్టం ఇటువంటి అడ్డగోలు అధికారాలను కట్ట బెట్టదని మీరు వాదించొచ్చు. ఏచట్టము ఇలాంటి వాటిని సమర్ధించదు. చట్టాలు మంచి కోసమే చేస్తారు. ఇలా చాలా చెప్పొచ్చు. కానీ, అందులో లొసుగులు మాత్రం చెడ్డ ఉద్దేసంతోనే పూడ్చకుండా వదిలేస్తారు. అలాంటి చట్టాలకు 498A ఒక ఉదాహరణ.

అయితే ఈ గృహహింస చట్టం దాన్ని కూడా దాటేసింది. ఈ చట్టం సక్రమంగా అమలు జరిగినా సరే, అది మగాడి ప్రాధమిక హక్కులకు కూడా భంగం కలిగించగలదు. ఉదాహరణకు, నిన్ను నీ సొంత ఇంటిలోనుండి బయతకు గెంటించడం. భారతదేశములో, నిజానికి ఇల్లు అనేది మగాడి ప్రాపర్టీ కానే కాదు, అది ఎవరు కట్టినా సరే. అది స్త్రీల ప్రాపర్టిగా మారిపోయింది. మరి అలాంటప్పుడూ ఇంత కష్ట పడి మగాడు ఇల్లు కట్టుకోవడం ఎందుకు. ఆ కొనేదేదో ఆడవాల్లనే కొనమని చెప్పండి, వారి స్త్రీ ధనంతో.

ఇంతా చెప్పడం ఎందుకు బాబూ అంటారా, ఢిల్లీ లాంటి నగరాలలో రోజుకు ఎంతమంది భర్తలు తమ సొంత ఇంటి నుండి గెంటివేయ బడుతున్నారో మనకు ఖచ్చితమైన సమాచారం లేదు గానీ( బయటకి రాదు, ఎందుకంతే మన శ్రీమతివాదుల దృష్టిలో అది తప్పుకాదు) చాలా మందే వుంటారని అంచనా. ఇటీవల ముంబాయిలో ఒక భర్త తన సొంత ఇంటినుండి గెంటివేయ బడ్డాడు, అంతేనా ఆ ఇంటికి EMI మాత్రం నెల నెలా అతనే కట్టాలి, తనకు ఇంకోక చిన్న ఇల్లు చూసుకొని దానికి అద్దె అతనే చెల్లించాలి. డబ్బులు వున్నవాడైతే EMI లు కట్టే అవసరం లేకుండానే ఇల్లు కొనుక్కో గలిగేవాడు. అలా జరగలేదంటే అతని అంత ఆస్థిపరుడు కానట్లే, జీతంలో చాలాభాగం EMIకి అద్దెకి చెల్లిస్తూ అతను పడే కష్టాలు మన సిగ్గులేని శ్రీమతి వాదులకి పట్టవు మరి.

ఇంత బాదెందుకండి అన్యోన్యంగా కాపురంచేస్తే ఇలాంటి గొడవలు వుండవు కదా అని అంటారా. ఇందాక నేను ఇది రాస్తున్నప్పుడు నా స్నేహితుడు కూడా ఇలానే అన్నాడు. అతనికి నేను చెప్పింది ఒక్కటె. అందరూ అన్యోన్యంగానే కాపురం చేయాలనుకుంటారు. ఎవరూ కళహాల కాపురం చేయాలనుకోరు. కానీ, పరిస్తుతులు నువ్వు కోరుకున్నట్లుగా వుండవు. స్త్రీలనే ఇల్లు కొనమను ( ఆమె స్త్రీ ధనంతో), అప్పుడు ఆమె అతను ఎంచక్కా అన్యోంగానే వుండొచ్చు. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా.

P.S

మొదటి పేరాలో నేను, దురాక్రమణ దారుల జాబితాలో భార్యలు కూడా చేరిపోయారని చెప్పాను. నిజానికది తప్పు మాట ఎందుకంటే, దాన్ని దురాక్రమణగా చట్టం గుర్తించదు. మన శ్రీమతి వాదులైతై దాన్ని ఆవిడ హక్కును సాధించుకోవడం అని ముద్దు పేరును కూడా పెట్టారు. సో నీ ఇల్లును నువ్వు పోగొట్టుకున్నా స్త్రీ తమ హక్కు సాధించుకోవడంలో తోడ్పడ్డావనుకుని సంబర పడి నోరుమూసుకుని కూర్చోవాలి.

హతోస్మి.

7 thoughts on “మగాళ్ళూ… ఇల్లు కొనడం మానండి.

  1. భర్తల చేతుల్లో బాధలు పడే భార్యలు అనేకమందే ఉన్నారు. వాళ్ల కోసం చేసినవే ఇటువంటి చట్టాలు. సమస్యేమిటంటే, ఇటువంటి చట్టాలు నిజంగా బాధలు పడే అమాయక భార్యామణులకన్నా రకరకాల కారణాలతో భర్తలని వేధించబూనుకునే భార్యలకే వరంగా మారాయి. ఇవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే, భర్తనొక్కడినే కాకుండా అతని కుటుంబాన్ని మొత్తం కేసులు పెట్టి వేధించటానికి ఈ చట్టం అనుమతిస్తుంది.

    భర్త సరైనోడు కాకపోతే ఆ కాపురాన్ని ఎన్ని చట్టాలు మాత్రం నిలబెట్టగలవు? చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాలు అవసరమైన స్థాయిలో కౌన్సిలింగ్ సదుపాయాలేమన్నా కల్పిస్తున్నాయా?

    మెచ్చుకోండి

  2. మీరు చెప్పినది అక్షరాలా సత్యం. నేనే ఈ అంశం గురించి రాద్దామనుకున్నాను. మీరు రాశారు. మీరు స్త్రీలందరినీ ఒకేలా భావించకండి. రాబోయే కాలంలో ఇలా జరగవచ్హు అని ఊహించి వ్రాశారు. బాగానే ఉంది. మగవాళ్ళయినా ఆడవారైనా డబ్బు, ఇల్లు వీటిల్లోనే సుఖముంది అనుకునేవాళ్ళు ఏనాటికైనా ఫలితం అనుభవించక తప్పదు. కాలమే అన్నిటికీ సమాధానం చెపుతుంది.
    (మీ పోస్టులో ఎన్నో తప్పులున్నాయి. కొంచెం ఓపిక చేసుకుని సరిదిద్దండి)

    మెచ్చుకోండి

  3. హమ్మో! ఇలా కూడా జరుగుతోందా. అయితే నేను కట్నం దండిగా పుచ్చుకుని, ఆ డబ్బులతోనే ఇల్లు కట్టిచ్చి, అందులోనే ఉంటా. భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చి ఇల్లు ఖాళీ చెయ్యమన్నా ఏ బాధ ఉండదు. :):)

    మెచ్చుకోండి

  4. […] రాసిన “మగాల్లూ … ఇల్లుకొనడం మానండి” అన్న టపాలోని ఒకవ్యాఖ్యలో, […]

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి