“పార్లమెంట్” వద్ద పురుష హక్కుల కార్యకర్తల ఆందోళన … ఫొటోలు, ట్వీట్లు..!!

 IrBM – Irretrievable breakdown of marriage – అంటే, వివాహం బంధం ఇక ఎంతమాత్రం కొనసాగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి వస్తే విడాకులు ఇచ్చేయడం తప్పు కాదు అన్నది ప్రస్తుతం హిందూ వివాహ చట్టములో చేస్తున్న మార్పు. ఇది వరకు అలాంటి పరిస్థితి లేదు. అది మంచిదేగా అంటారా? అక్కడే ఉంది అసలు మెలిక. విడాకులు తీసుకోవచ్చు అని ఊరుకోవడములేదు. విడాకుల తరువాత స్త్రీకి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండడానికి ఆవిడకు భరణం ఇవ్వాలి అంటున్నారు. అది న్యాయమైన డిమాండే. నిజానికి మనకు ఈ భరణానికి సంబందించిన చట్టం ఉంది. దాని ద్వారా మరియూ DV Act ద్వారా కూడా స్త్రీ భరణం కోరవచ్చు. పురుషుడు చెల్లించాల్సిందే. కానీ, ఇప్పుడు ఇవన్నీ కాదు, భార్యకు భర్త ఆస్థిలో వాటా ఇవ్వాలి అంటున్నారు. అదీ అసలు చిక్కు.

ఇక్కడ భర్త ఆస్థి అంటే, మగాడు పెళ్ళైన తరువాత సంపాదించినది + పెళ్ళికాక మునుపు సంపాదించినది + అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్థితో కలిపి అని గ్రహించగలరు. అతని ఆస్థుల విలువ ఎంతో ఈ విధంగా లెక్క వేసి దానిలో భార్యకు వాటా ఇవ్వడం జరుగుతుంది.

కాకపోతే అది 50% కానక్కర్లేదు. కోర్టులో జడ్జీలు వాటా ఎంత అనేది నిర్ణయిస్తారు. సాధారణంగా అది 50%కి తగ్గదు. ఇంకో విషయం ఏమిటంటే, పిల్లలు ఉంటే ఎలానూ వారి సమ్రక్షణ తల్లికే వెలుతుంది కాబట్టి, వారి పోషణ నిమిత్తం కూడా భర్త డబ్బు చెల్లించాల్సి రావచ్చు. అంతా కలిపి 70 – 80% ఆస్థి అలా పోయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అంటే నీ ఆస్థి మీద నీ హక్కులు 30% నుండి 50% మాత్రమే. ఈ IrBM గురించి తెలీని వారికోసం, దాని గురించి వివరిస్తూ 125 సెకండ్ల వీడీయో ఒకటి పురుష హక్కుల కార్యకర్తలు రూపొందించారు. అది చూడండి.

ప్రపంచములో చాలా దేశాలలో ఇలాంటీ చట్టాలున్నాయని స్త్రీవాదులు ఎంతో చాకచక్యంగా అబద్దాలు అల్లుతున్నారు కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ ఆస్థుల పంపకాలప్పుడు కేవలం మగవారి ఆస్థిని మాత్రమే పంచుతారు. అంటే స్త్రీలకున్న ఆస్థిని ఈ పంపకాల సమయములో పరిగణలోకి తీసుకోరు. స్త్రీల ఆస్థిమీద మగవారికి ఎలాంటి హక్కూ ఉండదు. ఇలాంటి తింగర చట్టం మాత్రం ప్రపంచములో ఎక్కడాలేదు. ఏదైనా ఉంటే,కేవలం మగవాడు, పెళ్ళైన తరువాత సంపాదించిన ఆస్థిలో మాత్రమే వాటాలుంటాయి. అది కూడా స్త్రీ పురుషుల ఇరువురి ఆస్థులనూ పరిగణలోకి తీసుకునే పంపకాలు జరుగుతాయి. వివిధ దేశాలలో విడాకుల తరువాత ఆస్థి ఎలా పంచబడుతుందో కంపేర్ చేస్తూ ఓ పురుష హక్కుల కార్యక్త రాసిన బ్లాగు పోస్టు చూడండి..!!

A Comparative analysis of property division on divorce in different countries

హిందూ వివాహ చట్టానికి చేయబోతున్న సవరణలో ఇంకో బోనస్ కూడా ఉందండోయ్. అదే “నో ఫాల్ట్ డైవోర్స్” అనగా ఎలాంటి తప్పూ లేకపోయినా, ఇరువురి అంగీకారం లేకపోయినా ఎవరో ఒకరు మాకు విడాకులు కావాలని అడగవచ్చు. ఇరువురూ అలా కోరవచ్చా అంటే అవును, భార్యా భర్తలిరువురిలో ఎవ్వరైనా నో-ఫాల్ట్ డైవోర్స్ కింద విడాకులు కోరవచ్చు. చూడడానికి సమానత్వాన్ని పాటించినట్లు కనపడుతోంది కదా? ఇక్కడున్న మరో మెలిక ఏమిటంటే, నో-ఫాల్ట్ డైవోర్స్ కింద స్త్రీ  విడాకులు కోరితే పురుషుడు దాన్ని వ్యతిరేకించలేడు, చచ్చినట్టు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవాల్సిందే. కానీ, పురుషుడు కోరితే మాత్రం స్త్రీ దాన్ని వ్యతిరేకించవచ్చు. విడాకుల తరువాత తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి అన్న సాకును చూపి. అందుకే ఇచట్టానికి వ్యతిరేకంగా అనేక మంది పురుష హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. బోలెడన్ని ధర్నాలు చేశారు. ప్రస్తుతం ఈ చట్టానికి సంబందించిన బిల్లు పార్లమెంటులో ఆమోదానికి న్యాయ శాఖా మంత్రి కపిల్ సిబాల్ ప్రవేశపెట్టారు. ఒకసారి ఇది ఆమోదం పొందితే ఇక అంతే సంగతులు చిత్తగించవలయును. అదన్న మాట. ఈబిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టగానే ఢిళ్ళీలోని పురుష హక్కుల కార్యకర్తలు ఏకంగా పార్లమెంటు ఎదురుగానే తమ నిరసనను తెలియ జేశారు. ఈరోజు ఉదయం 11:00లకు పురుష హక్కుల కార్యకర్తలు చేస్తున్న నిరసనకు చెందిన ఫోటోలు కొన్ని… (ఈ బిల్లుగురించి చర్చకు వస్తోంది అని తెలుసుకున్న వెంటనే, అప్పటికప్పుడు ఢిల్లీలో ఉన్న కొద్ది పాటి కార్యకర్తలు మాత్రమే అక్కడికి వెల్లారు)

10671394_750413115030239_7269213070903409282_n 1175409_10153216276120221_1640376295_n 1174809_10153216134835221_1812386045_n 1014226_10153216149635221_1685920966_n 994911_10153216137815221_1221207032_n 556339_10153216272680221_918656359_n 182392_10153216164025221_1151571258_n 993995_10153216133835221_1816902624_n

ఇవే కాదు పురుష హక్కుల కార్యకర్తలు అనేక మంది ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కు సాధనాల ద్వారా అనేకమంది ఎం.పీలకు, వార్తా ఛానల్లకు, జర్నలిస్టులకు ఇంకా అనేక మంది ప్రముఖులకూ ఈ చట్టాల గురించి వివరిస్తూ వాటినిపై అవగాహన తీసుకురావడానికి కృషిచేస్తూ, దానికి వ్యతిరేకంగా చేసే పోరాటములో సహాయం చేయమని అబ్యర్తిస్తూ ఉన్నారు. అదే కాకుండా ట్విట్టరులో ఉండే ఫెమినిస్టులతో వీరు సాగించే పోరు కూడా వీరి చర్యలలో భాగంగా ఉంటుంది. మీరు ఈ చట్టం గురించి చేసిన ట్వీట్లనన్నింటినీ చదవాలనుకుంటే ” #IrBM ” అని ట్విట్టర్ సైట్లోని సెర్చులో టైప్ చేసి, సెర్చ్ కొట్టండి.(చాలా ట్వీట్లు వస్తాయి, అన్ని చదవడం అంటే చాలా టైం పడుతుంది, కానీ ముఖ్యమైనవి చూడవచ్చు, ఒక అవగాహనకు రావచ్చు).

1 thoughts on ““పార్లమెంట్” వద్ద పురుష హక్కుల కార్యకర్తల ఆందోళన … ఫొటోలు, ట్వీట్లు..!!

  1. thank u everyone , i m 22 yr employed guy , i m afraid of marriage , i decided to have love marriage bcuz even if laws r on women’s side but if i get a loving girl i can be assure that she will not misuse any laws , instead of that she ll also help me financially but if didnt get love marriage or amendment does not take place for men’s rights then i will leave the country & will marry a western women

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి