ఢిల్లీ విద్యార్థి రేప్, చిత్ర హింసలు, ఫేస్‌బుక్‌లో నగ్నచిత్రాల పొస్ట్..!!


ఢిల్లీలో మరో రేప్.  ఈ సారి బాధితుడు ఒక యువకుడు. అతన్ని అపహరించి, చిత్రహింసలకు గురిచేసి,  అతన్ని రేప్ చేసి, తరువాత అతని మర్మావయవాలపైనా మరియు గాయాలపైనా ఉప్పూ, కారం, లిక్కర్ పోసి హింసించారు. తరువాత అతని నగ్న చిత్రాలను ఫేస్‌బుక్ లో అప్‌లోడ్ చేశారు. ఈ భయానక సంఘటన ఘజియాబాద్‌లోజరిగింది (దాదాపుగా ఢిల్లీలో కలిసిపోయిన ప్రాంతం).

ఈ దారుణానికి వొడిగట్టిన వ్యక్తి ఆ గ్రామ పెద్ద.  బాధితుడు, తన కూతురిని ఫోన్లు చేసి వేధిస్తున్నాడు అన్న అనుమానముతో ఈ గ్రామ పెద్ద ఇటువంటి ఘాతుకానికి ఒడిగట్టు కొన్ని వార్తలు చెబుతున్నాయి. మరికొన్ని మాత్రం బాధితుడు తన కూతురుతో స్నేహంగా ఉండడం ఇష్టం లేకే ఇటువంటి పని చేశాడని చెబుతున్నాయి. రెండింటిలో ఏది నిజమైనా సరే, జరిగింది మాత్రం దారుణం, గర్హనీయం, శిక్షార్హం.

బాధితుడు, గ్రామ పెద్ద కూతురు మధ్య ఉన్న స్నేహం గ్రామ పెద్దకు నచ్చలేదు. తన కూతురితో స్నేహాన్ని మానకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించడం కూడా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బాధితుని సోదరుడి మాటల ప్రకారం, బెదిరింపులు ఎదుర్కొన్న తరువాత, అతను[బాధితుడు] గ్రామపెద్ద కూతురుని దూరంగా పెట్టాడు. కానీ, అతని  దురదృష్టవశాత్తూ, ఆమెకు కొంత మంది ఆకతాయిల నుండి అసభ్య ఫోన్ కాల్స్ రావడం జరిగింది. అది బాధితుని పనే అని భావించిన గ్రామ పెద్ద ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

గ్రామ పెద్ద, అతని అనుచరులు మరి కొంతమంది ఆ యువకున్ని, ఈ అసభ్య ఫోన్ కాల్స్ గురించి ఏమాత్రం వివరణ అడగకుండా, కనీసం వాటిని ప్రస్తావించకుండా అపహరించి, ఒక ఫార్మ్ హౌస్ కి తీసుకెల్లి, అక్కడ అతన్ని విపరీతంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారు. వారిలో ఒకతను ఆ యువకున్ని రేప్ చేశాడు (Sodomy). అతని మీదకి కుక్కలను ఉసిగొల్పారు. తరువాత అతని గాయాలపైనా, మర్మావయవాలపైనా ఉప్పు, కారం రాసి, లిక్కర్ పోసి హింసించారు. ఆ యువకుడు తనకూ, అసభ్య ఫోన్ కాల్స్ కు ఎటువంటి సంబంధం లేదని, తనను వదిలేయమని ఎంత ప్రాధేయపడినా వారు కనికరించలేదు. ఈ దారుణమైన ఘఠన సోమవారం చోటు చేసుకుంది.

విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులు మంగళవారం ఫాం హౌసుకు వెల్లి అతన్ని విడిపించారు.  గ్రామపెద్ద, బాధితుడిని అతని కుటుంభాన్ని  తీవ్రంగా బెదిరించడం కూడా జరిగింది.  బాదితుని కుటుంబ సభ్యులు గ్రామ పెద్దతో ఢీకొనగలిగే శక్తిలేక అతనితో కాంప్రమైజ్ అవ్వడానికే నిశ్చయించుకున్నారు. కానీ,  ఇది ఇంతటితో ఆగలేదు. ఫేస్‌బుక్కులో ఒక ఫేక్ అకౌంటు క్రియేట్ చేసి, ఆయువకుని నగ్న చిత్రాలను పోస్టు చేయడమే కాదు, చాలా మందికి ఇన్విటేషన్లు పంపడం, అతని స్నేహితులకు ఆఫోటోలు పంపడముతో, ఆయువకుడు దాన్ని భరించ లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కానీ, అతని కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నాలను ఆపారు.  చివరకి ఆ యువకుడు బుధవారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి, తనకు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండని కోరడం జరిగింది. వారు అతన్ని వారించి, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పోలీసులు నిందితులపై 323 (punishment for voluntarily causing hurt), 328 (causing hurt by means of poison etc, with intent to commit an offence), 342 (punishment for wrongful confinement), 377 (unnatural offence), 147 (punishment for rioting), 148 (rioting, armed with deadly weapon) , IT Act.  సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మీడియా ధోరణి:  అత్యాచారం జరిగింది యువకుడి మీద కావడముతో మీడియా హైపర్ సెన్సిటివిటీ చూపలేదు సరి కదా కనీస భాధ్యతను కూడా మరిచిందని చెప్పొచ్చు.  మొత్తం ఈ సంఘఠనలో మీడియా బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టూ కనిపిస్తోంది.

1. మొదటగా వారు దీన్ని ఎక్కడా “రేప్” అని మెన్షన్ చేయలేదు. చాలా వరకు వార్తా కథనాలలో “యువకుడి అపహరణ, చిత్రహింసలు, సోడొమి అనే పదాలు వాడారే కానీ, రేప్ అనే పదాన్ని ఎక్కడా వాడకుండా జాగ్రత్త పడ్డారు(ఒకటీ అరా పత్రికలు దీనికి మినహాయింపు). వారు దీన్ని రేప్ గా భావించడం లేదా?  రేప్ బాధితులలో మగవారు కూడా ఉంటారు అనే అంశాన్ని వారు అంగీకరించడం లేదా?

2. రేప్ కేసులలో బాధితురాలు పేరు బహిరంగ పరచకూడదు కానీ మీడియా బాధితుని పేరూ, గ్రామం, కాలేజీ అన్నీ విపులంగా ప్రచురించాయి.  ఫోటో పెట్టడం ఒక్కటే తక్కువ.  ఎందుకంటే అతను పురుషుడు కాబట్టి, అలా ప్రచురించడం చట్ట ప్రకారం ఎటువంటి చిక్కులను తెచ్చిపెట్టడు కాబట్టి. కానీ వారికున్న నిబద్దత ఏమైంది? మగవారిపై జరిగే రేప్ లను చట్టం, మీడియా రేప్‌లుగా గుర్తించదు అనుకున్నా, కనీసం ఆవ్యక్తి ఐడెంటిటీని దాచొచ్చు కదా? గ్రామ పెద్ద యువకుడి నగ్న చిత్రాలను ఫేస్‌బుక్కులో పెట్టి కేవలం కొంత మందికి మాత్రమే తెలియ పరచ గలిగాడు. కానీ, మీడియా మాత్రం  అతని పేరూ, ఊరూ, కాలేజీ ప్రచురించి దేశం మొత్తానికి తెలియ పరిచింది.

ఈ చర్యను వ్యాఖ్యాతలు తీవ్రంగా నిరసించిన తరువాత, కేవలం ఫస్ట్ పోస్ట్ మాత్రమే జరిగిన తప్పిదానికి క్షమాపణలు తెలియ జేసుకుని పేరును తొలగించింది.  మిగిలిన పత్రికలు (టైంస్ ఆఫ్ ఇండియా తో సహా) ఆ పనులు చేయలేదు.

చట్టాల తీరు:  మగవారిపై స్త్రీలు అత్యాచారం చేస్తే (ఇది సంభవమే, చాలా జరిగాయి కూడా) దాన్ని మన చట్టం రేప్‌గా గుర్తించదు. రేప్ చట్టాలలో కేవలం పురుషుడు మాత్రమే దోషి. స్త్రీలను దోషులుగా చట్టం గుర్తించదు. కానీ బాధితుడు మాత్రం స్త్రీ, పురుషులు ఇరువురూ అవ్వొచ్చని ఈ మధ్య చదివినట్టు గుర్తు. మరి పోలీసులు ఎందుకు దీన్ని రేప్ కేసుగా పరిగణించడం లేదో మరి. వారు కేసులు పెట్టిన సెక్షన్లలో దీన్ని అన్ నేచురల్ సెక్స్ కు సంబందించిన సెక్షన్లలో మాత్రమే చేర్చారు.

ఏదేమైనా ఇటువంటి కేసులలో మీడియా, చట్టం రెండూ తమ దృక్పదాన్ని మార్చుకొని, బాధితులకు న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రిఫరెన్సెస్: బాదితుని పేరు ప్రచురించని వాటిని మాత్రమే నేను రిఫరెన్సుగా ఇస్తున్నాను.

1. Another shocker: DU student raped for being friends with a girl

2. Man abducts, strips Delhi University boy